దీపము పరమ బ్రహ్మము
దీపపు దీప్తుల్ హరించు తిమిరపు తతులన్
దీపమున సాధ్య మెల్లను
దీపమునకు మ్రొక్క రారె ధీయుతులారా!
భానుడు చింత నొందె కట! పాపము ధాత్రికి వెల్గు లెట్టులౌ
నేను చనంగ రాత్రి ?యని, నీవిక చింతను వీడు, పోయి రా !
నేనిడు దాన కాంతులను నెమ్మది, నీవరుదెంచు దన్క, నా
మే నిల నుండు దాక యనె మిత్రుని తోడను దివ్వె కూర్మి మై.
No comments:
Post a Comment