
మున్మహిషాసురున్ దునిమి మూడు జగమ్ముల నేలవే కృపన్
సన్ముని దేవ సంఘములు సంస్తుతి సేయ భవాని! చండికా!
జన్మము ధన్యమై, తనువు ఝల్లన, మానస ముల్లసిల్లగా
చిన్మయ రూపిణీ! నిను భజించెడు భాగ్యము నిమ్ము సర్వదా!
పద్యము తెలుగుల విద్యగు! హృద్యము చదువరుల కెన్న, నింపగు వినగా ! పద్యము కవితల కాద్యము! సద్యశమును కల్గజేయు చక్కగ కవికిన్!