
వలబోజ వంశ మనగా
నిలలో నొక క్షీర జలధి! ఇదిగో కను డా
జలధిని ప్రభవించిన దీ
నెల రాడ్బింబమ్ము 'జ్యోతి' నెలవై కళకున్!
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
బ్లాగుల శిల్పి వీవు పలు బ్లాగుల రూపును చక్క దిద్ది బా-
గోగులు చూచు చుండెదవు యోర్మిని వాటికి కొంగు బంగరై,
బ్లాగులు వృద్ధి చెందెడిని బాగని మెచ్చగ తోటి బ్లాగరుల్
'బ్లాగుల జ్యోతి'వౌ తెలుగు బ్లాగ్ గురు నీకు శతాభి వందనల్!
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
అంతర్జాలము నందున
నెంతో నేర్పొప్ప నీవు యెంతో మందిన్
సుంతన్ విసుగున్ జెందక
సొంతమ్మౌ బ్లాగు గలుగ జూతువు గాదే!
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
బహుముఖ ప్రజ్ఞల జూపుచు
నహరహమును బ్లాగులందు నానందముగా
విహరించుచుండు జ్యోతీ!
రహియింపుము మంచితనము రాణింపంగాన్!
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
బాగు బాగు జ్యోతి! బహు బాగు నీ సేవ!
బ్లాగు లోకమందు పరిఢవిల్లె!
ఆయువిచ్చు, దేవు డారోగ్యమున్ యిచ్చు,
వదలకుండు మతిని వాణి యెపుడు!
********************************************************