padyam-hrudyam

kavitvam

Thursday, December 23, 2010

గణేశ స్తుతి

















చేత వేడి కుడుము చెన్నొందు బొజ్జయు
ఎలుక వాహనమ్ము ఏన్గు ముఖము
పెద్ద చెవులు మెరయు పెరికిన దంతమ్ము
విఘ్నరాజ నీకు వేయి నతులు.

********************************

కొల్తును నే గణ నాథుని
కొల్తును నే గౌరి సుతుని కొల్తును దంతున్
కొల్తును నే విఘ్నేశ్వరు
కొల్తును నే శుభములీయ కూర్మిని సతమున్.

2 comments:

బులుసు సుబ్రహ్మణ్యం said...

2011 వ సంవత్సరం మీకూ, మీ కుటుంబ సభ్యులందరికి శుభప్రదం గానూ, జయప్రదంగానూ, ఆనందదాయకం గానూ ఉండాలని మనస్ఫూర్తి గా కోరుకుంటున్నాను.

రాజేశ్వరి నేదునూరి said...

నమస్కారములు
మిస్సన్న గారు. మీ పద్యం హృద్యం చాలా బాగుంది " శారదాస్తుతి,గణేశస్తుతి, చాలా చాలా బాగున్నాయి. మీ రంతా పండితులు.నాకు చందస్సు అభిమానమె గాని రాయడం ఇప్పుడే గురువు గారి ధర్మము + మీ అందరి ఆదరణ ఈ మాత్రం రాయగలుగు తున్నాను. మీ అందరికి మరొక సారి కృతజ్ఞతలు