ప్రజ-పద్యం
***************
దండమయా విఘ్నేశ్వర!
దండమయా శంభుపుత్ర! దండము వరదా!
దండమయా గౌరీసుత!
దండమయా నీకు నెపుడు దండము గణపా!
విద్యల నిమ్మా దయతో
పద్యంబుల జెప్పగల్గు పటుతర శక్తిన్
సద్యః స్ఫూర్తిని యిమ్మా
హృద్యంబయి బుధులు మెచ్చ నిమ్ముగ వాణీ!
పద్యమె మనదౌ లోకము
పద్యమె శ్వాసయును ధ్యాస పద్యమె స్వరమౌ
పద్యమె భావము రాగము
పద్యమె సర్వమును మనకు బంధువులారా. 1
ప్రజ-పద్య కవివరుల్ ప్రభవించు తరగలై
.....సమధికోత్సాహాన సందడించ
పఠియించు కవితల ప్రమద నాదమ్ములు
.....జలధిఘోషను మించి చెలగి రేగ
కవియశశ్చంద్రికల్ కమనీయ కాంతులై
.....ఫేనరాజిగ తళ్కు లీనుచుండ
పక్షపద్యావళు లక్షయానర్ఘంపు
.....రత్నాల ముత్యాల రాశులవగ
నేటి ప్రజ-పద్య వైశాఖ మేటి ఘటన
పొంగ పద్యాభిమానుల పురణమగుచు
చిన్నవోయెను సంద్రమ్ము తన్ను మించు
క్రొత్త సింధువు జాడతో తత్తరమున. 2
పద్యము లేని తెన్గు వసి వాడు నటంచు తలంచి యీ ప్రజా
పద్య సదస్సు పూనికను పద్యము లల్లెడి వారి నందరన్
సద్యశ పాత్రులై పరగ సంఘటిత మ్మొనరించి యిచ్చట న్
హృద్య కవిత్వ రీతులను నింపుగ చాటె తెలుంగు నేలపై. 3
పదికాలమ్ములు పచ్చగా బ్రతికి పద్య మ్మీ ధరిత్రిన్ ప్రజా
హృదయాబ్జమ్ముల కాంతులీను రవియై యింపారగన్ సత్కవుల్
మదులన్ పూనుక జేరి మాధ్యమమునన్ మాన్యత్వ మేపారగా
పదులున్ వందలు వేలు పద్యములతో భాషాంగనన్ గొల్వగా.
ప్రజపద్యంపు మనోహరాంగణమునన్ భవ్యాత్ములౌ సత్కవుల్
స్వజయోత్సా హము మించ స్పర్థ బరిలో సామాజికాభ్యున్నతిన్
నిజభావమ్ముల నుంచి వ్రాసిరి కదా నిండైన పద్యావళుల్
ప్రజ లోహో యని మెచ్చురీతి విబుధుల్ బాగంచు కీర్తించగన్. 4
పద్యామృతము ద్రావి వైనతేయుడు ధృతి
.....తోడను సుధ దెచ్చె తొల్లి వినవొ
పద్యోపదేశమై బాలధ్రువుడు దివ్య
.....పదమును పొందెను మొదలు వినవొ
పద్యస్మరణ చేత బాలప్రహ్లాదుండు
.....నాన్నను కాదనె మున్ను వినవొ
పద్యమ్ముపాసించి పవనసూనుడు సంద్ర
.....మును దాటె లీలగా మునుపు వినవొ
బ్రహ్మ రుద్రాదు లందిరి పద్యమహిమ
శాశ్వత మ్మగు పదవుల సంతసమున
పద్య మహిమను వర్ణింప బ్రహ్మ కైన
నాదిశేషుని కైనను కాదు తరము. 5
పద్య గంధము లలదుక

No comments:
Post a Comment