కారుణ్యామృతనీరమాశ్రితజనశ్రీచాతకానన్దదం
శార్ఙ్గాఖణ్డల చాపమమ్బుజభవోగ్రేన్ద్రాదిబర్హీష్టదమ్ .
చారుస్మేరముఖోల్లసజ్జనకజాసౌదామినీశోభితం
శ్రీరామామ్బుదమాశ్రయే ఖిలజగత్సంసారతాపాపహమ్
శార్ఙ్గాఖణ్డల చాపమమ్బుజభవోగ్రేన్ద్రాదిబర్హీష్టదమ్ .
చారుస్మేరముఖోల్లసజ్జనకజాసౌదామినీశోభితం
శ్రీరామామ్బుదమాశ్రయే ఖిలజగత్సంసారతాపాపహమ్
తన రామాయణ వ్యాఖ్యానాన్ని మొదలు బెడుతూ , మహేశ్వర తీర్థులు చేసుకున్న రామ ప్రార్ధనా శ్లోకం .
*********
కారుణ్యామృతవర్షిణి ఘనరామాంబుదము.
అద్భుతమైన సుందరమైన శ్లోకము నావిష్కరించిన మహనీయులకు నమస్సుమాంజలులు.
కారుణ్య పీయూష పూరిత మ్మియ్యది
.....ఆశ్రిత చాతకాహ్లాదనమ్ము
శార్ఙ్గాఖ్యయై యొప్పు శక్రకార్ముక మిది
.....స్రష్టజిత్యాదిబర్హేష్టిదమ్ము
సుందరజానకీ మందహాసోజ్జ్వల
....సౌదామినీప్రభా సంశ్రయమ్ము
సర్వప్రపంచసంసారోగ్ర గ్రీష్మాప
....హమ్మగు చలువల కాస్పదమ్ము
నేరవే దీని హృదయమా నిరతి లేదె?
మాటికి దెసల జూతువే మందబుద్ధి?
చెంత నున్నట్టి దీనిపై చింత వోదె?
రమ్ము రామాంబు దమ్మిది రమ్ము చేర.
డాక్టర్ టి.వి.నారాయణ రావు గారి సౌజన్యతతో...
No comments:
Post a Comment