padyam-hrudyam

kavitvam

Wednesday, May 21, 2014

చేరి శరణని మ్రొక్కరే.........

ఈ దెస జనకుడు నా దెస జననియు 
..........నిచట తా నయ్యయు నచట నమ్మ !
ఈ వంక భర్గుడు నా వంక భార్గవి
..........యిచ్చట శివుడును నచ్చట శివ !
ఈ వైపు గిరివాసు డా వైపు గిరిజయు 
..........నిచట నీశానుండు నచట నీశ !
ఈ ప్రక్క శంభుడు నా ప్రక్క శాంభవి
..........యిచ్చట పరమేశు డచ్చట పర !

ఇతడు చంద్రశేఖరుడాయె నిదిగొ కనగ !
నామె శశికళా ధరియగు నదిగొ చూడ !
నిరువు రొక్కటై దయజేసి రింపు మీర !
జేరి శరణని మ్రొక్కరే తీరు చింత. 

2 comments:

కంది శంకరయ్య said...

అర్ధనారీశ్వర తత్త్వాన్ని అద్భుతమైన పద్యంలో ఆవిష్కరించారు. చాలా బాగుంది.

మిస్సన్న said...

గురువుగారు శంకరయ్య గారికి ధన్యవాదములు.