padyam-hrudyam

kavitvam

Sunday, November 27, 2011

చిన్మయ రూపిణీ !


నీ లలితాధరమ్మునను నిండుగ పూచిన నవ్వు పువ్వునే
నీల గళుoడు చంద్రునిగ నిత్యము దాల్చు శిరమ్ము నందునన్
రాలకునైన జీవమిడు రాజిలు నీ దరహాస చంద్రికల్
మాలిమి పొంగుటల్ కతన మానుగ చిన్మయ రూపిణీ ! శివా!

4 comments:

Sai said...

ఆ జగన్మాత గురించి ఎంత చక్కగా రాసారండీ...చాలా బాగుంది..

Unknown said...

ఆ జగన్మాత గురించి ఎంతో చక్కగా రాసారు.

మిస్సన్న said...

సాయి గారూ స్వాగతం. చిన్మయరూపిణి మీకు సకల శ్రేయస్సులూ కలుగ జేయ గలదు. ధన్యవాదాలు.

మిస్సన్న said...

కల్లూరి శైల బాల గారూ స్వాగతం. జగన్మాత మీకు సకల సౌభాగ్యాలూ ప్రసాదిన్చగలదు. ధన్యవాదాలు.