

ఆ.వె. చవితి పండుగంచు సంబరమేపార
బొజ్జగణపతయ్య బొమ్మ పెట్టి
పాలవెల్లి పత్రి పండ్లను గొనితెచ్చి
పూజచేయ నేను పూనుకొంటి.
ఆ.వె. మావి గరిక తులసి మారేడు నేరేడు
జమ్మి దేవదారు జాజి పత్రి
కలువ మల్లె మొల్ల గన్నేరు చామంతి
పూలు తెచ్చి నేడు పూజ చేతు.
పద్యము తెలుగుల విద్యగు! హృద్యము చదువరుల కెన్న, నింపగు వినగా ! పద్యము కవితల కాద్యము! సద్యశమును కల్గజేయు చక్కగ కవికిన్!