రావణ భవన, పుష్పక విమానముల వర్ణనము
సీ.మెఱపుల శోభిల్లు మేఘ పంక్తుల వోలె.........వజ్రవైడూర్యాది భాసితములుఁజిత్తము ల్దోచెడి చిత్రమౌ రీతినిఁ.........జంద్రశాలల నొప్పు శైలములునురావణ స్వార్జిత రమ్యసంపదలతో.........దేవాసురులు మెచ్చు దివ్యములునుభూతల మందున భూరి గుణాఢ్యమై.........మయ నిర్మితంబైన మహితకరముతే.గీ.లతుల శస్త్రాస్త్రములు గల యంపశాల,లంబుజాత సంపన్న జలాశయములుఁజిత్ర భూరుహ పంక్తులఁ జెలగు వనములమల శ్వేతసౌధమ్ములు నచట దనరె. 7- 1సీ.మెఱపు తీగల వంటి మించు బోడులఁ గూడి..........మేఘమో యన నొప్పు మేటిదనమురాజహంసల చేత లాగఁబడెడు రీతి ..........దేవ విమానంపు దిట్టఁదనముగైరికా ద్యుత్క్రుష్ట ఘన ధాతువుల తోడఁ..........బ్రభల నీనెడు కొండ పచ్చదనముగ్రహరాశి గమకాల గ్రహనేమి* వెల్గుల..........నిగ్గారు గగనంపు నిండుదనముతే.గీ.రంగు రంగుల మబ్భులు హంగు మీర నొక్కెడను జేరి మెఱసెడి చక్కఁదనమురత్న నిర్మిత శిఖరంపు రాజసమ్ముప్రస్ఫురిల్లెడి రావణావాస మదియె. 7- 2*చంద్రుడు
సీ.
మెఱపుల శోభిల్లు మేఘ పంక్తుల వోలె
.........వజ్రవైడూర్యాది భాసితములుఁ
జిత్తము ల్దోచెడి చిత్రమౌ రీతినిఁ
.........జంద్రశాలల నొప్పు శైలములును
రావణ స్వార్జిత రమ్యసంపదలతో
.........దేవాసురులు మెచ్చు దివ్యములును
భూతల మందున భూరి గుణాఢ్యమై
.........మయ నిర్మితంబైన మహితకరము
తే.గీ.
లతుల శస్త్రాస్త్రములు గల యంపశాల,
లంబుజాత సంపన్న జలాశయములుఁ
జిత్ర భూరుహ పంక్తులఁ జెలగు వనము
లమల శ్వేతసౌధమ్ములు నచట దనరె. 7- 1
సీ.
మెఱపు తీగల వంటి మించు బోడులఁ గూడి
..........మేఘమో యన నొప్పు మేటిదనము
రాజహంసల చేత లాగఁబడెడు రీతి
..........దేవ విమానంపు దిట్టఁదనము
గైరికా ద్యుత్క్రుష్ట ఘన ధాతువుల తోడఁ
..........బ్రభల నీనెడు కొండ పచ్చదనము
గ్రహరాశి గమకాల గ్రహనేమి* వెల్గుల
..........నిగ్గారు గగనంపు నిండుదనము
తే.గీ.
రంగు రంగుల మబ్భులు హంగు మీర
నొక్కెడను జేరి మెఱసెడి చక్కఁదనము
రత్న నిర్మిత శిఖరంపు రాజసమ్ము
ప్రస్ఫురిల్లెడి రావణావాస మదియె. 7- 2
*చంద్రుడు
తే.గీ.
ధరణి పర్వత మయము భూధరము లచట
వృక్ష సంభార హితములు , వృక్ష తతులు
పుష్పగుచ్ఛ శోభితములు, పుష్పచయము
కేసరాయుతములు నట వాసిగాను. 7- 3
ఆ.వె.
వివిధ రత్న కాంతు లవిరళ గతి నొప్ప
నున్నత భవనముల నున్నత మయి
పుష్పకాఖ్య మైన భూరి విమానమున్
బవన సుతుఁడు సూచి ప్రమద మందె. 7- 4
కం.
పగడాల తాపడముతో
ధగధగ నపరంజి నిర్మితంబై చిలుకల్
దగ మదనోద్దీపక గతి
నగుపించెను బుష్పకమున నయ్యెడ గపికిన్. 7- 5
కం.
పద్మాల సరసులో నొక
పద్మాసనమందుఁ జేతఁ బద్మము తోడన్
బద్మయు, కరు లా దేవిని
బద్మాలను గొల్చు చిత్ర భంగిమ లొప్పెన్. 7- 6
ఆ.వె.
ఇన్ని కనియు రావణేశుని లంకలో
సీత నరయ లేమిఁ జింత నొందె
నిశిత బుద్ధిశాలి నేర్పరి శిక్షిత
మనము తోడ నొప్పు హనుమ యకట. 7- 7
No comments:
Post a Comment