padyam-hrudyam

kavitvam

Saturday, October 17, 2026

సరస్వతి - కాళరాత్రి




సరస్వతీ స్తుతి 

కమలహంస వృత్తము
న భ స న జ ర.. యతి 11

అనుపమంబగు రహి తోడ నవని భారమైన శుం 
భుని నిశుంభునిని వధింపఁ బొలిచి జ్ఞానరూపివై 
చెనటులం బలుకులఁ బ్రజ్ఞ సెలఁగ మాయఁ జేసి నా 
శనము జేసితివి కృపారసమయి శ్రీ సరస్వతీ!

****

కాళరాత్రి స్తుతి 

కమలహంస వృత్తము
న భ స న జ ర.. యతి 11

వినఁడటంచు వినిచినట్టి విమలమైననోముచే


ఖరతురంగ కఠిన చిత్త గణములైన దైత్యులన్ 
హరి విహారమునకు బంప నలరు కాళరాత్రివే
శరణు వేడు సుజనవర్య చయపుఁ గల్పవల్లివై 
శరద రాత్రి వగుదు వీవు సకల లోక రక్షకీ! 

Sunday, October 11, 2026

 


1) దధి/ఉదధి
గణములు:-- భ భ భ
యతి లేదు
ప్రాస కలదు

శైలసుతా! నవరాత్రుల
వేళల దొల్తను గొల్తుము
మాలిమి లోకుల నెల్లర   
నీ లలి నిత్యము నేలుము.  

2) అర్థకల వృత్తము
గణములు స స స
యతి లేదు.

నవరాత్రుల శైలసుతా! 
శివరాణివి నీవనుచున్
కవనాలను బూవులతో  
స్తవమాల లివే గొనవో.   
 
3) మహాలక్ష్మీ వృత్తము
గణములు ర ర ర
యతి లేదు.

మేనదేవీ తుషారాద్రులే 
సూనగా నిన్గొనన్ బున్నెముల్ 
బూని యే జన్మలో జేసిరో 
మానినీ శైలపుత్రీ! నతుల్.

Thursday, September 17, 2026

నరేంద్ర మోది జన్మదినం

 



సీ. పెండ్లాము బాధ్యత పిల్లల రక్షణ 
... తరువాత తరమను తగవు లేదు
పోగేతపై యావ భోగాల లాలస 
...పదవిఁ గాచుకొను దురదయు లేవు
వయసుతోఁ బైఁబడు వ్యాధుల బాధయుఁ 
...దిండి తిప్పల ధ్యాస దెలియ రావు
దీన స్వభావము హీన ప్రభావము
...దాపులనైనను దోపఁ బోవు 

తేగీ. సౌఖ్య మనఁ బ్రజ కొనఁగూడు సౌఖ్య మగును
రాగ మన దేశమాతపై రాగ మగును
వాంఛ యన భారతమును బ్రపంచ గురువు
పదవిలో నిల్పుటే 'మోది' వాంఛ యగును.

ఉ.సాగెను సాళ్ళు చాల మన చల్లని బంగరు భారతాంబపై
వీగి పరాయిగడ్డ పొదపెట్టిన గాయము కాని నేటికిన్
బాగును గోరు పాలకుఁడు బాధ్యత వర్తిలు ధీరనేతయై
లాగుచు నుండె బండిఁ గని ప్రాంజలి సేయఁగ దేశభక్తులే.

కం. ఏది సమస్త సమస్యలు
మేదిని భారతము నిలువ మేటిగ జగతిన్
హ్లాదినియై, ప్రజ లెల్లరు,
మోది శతాయుష్కు డగుత, ముదమునఁ జెలఁగన్.

Thursday, January 15, 2026

మకర సంక్రమణం 2026

 


పితరులు వత్తు రీ దినము పృథ్వికి సంక్రమణంపు వేళ సం

తతి గని మోదమై తనిసి తద్దయు దీవన లీయ, వారికై

హితముగ తర్పణాదికము లిచ్చి మముం గను డంచు శ్రద్ధతో

నతు లిడ నట్టి వారల కనంత శుభంబులు గూడు సర్వదా.