హనుమంతుడు పుష్పక విమానమును చూచుట
ఉ.
భూరి తపోబలమ్మునను బొందెను రావణుఁ డా విమానముం
గోరిన చోటి కేగు నది కోరు విధమ్మున వాయువేగియై,
చేరగ రాని దన్యులకు, శ్రీకర మైనది, శిష్ట కోటి సం
చారము సేయు మందిరపు సాటి కనెం గపి దాని వింతగా. 8- 1
కం. కుండల ధారులు, బెచ్చగు
తిండినిఁ దినువారు, నింగి ద్రిమ్మరు దైత్యుల్
దండిగ, మోయుచు నున్న
ట్లుండిన దా పుష్పకమ్ము నొక చిత్రమునన్. 8- 2
ఉ.
పండువు గాగఁ గన్నులకుఁ బర్ణరుహంబు*నఁ బుష్పరాశియో!
నిండగు నా శర ద్విమల నీరజశాత్రవ నిర్మలత్వమో!
మెండగు పుష్పకాలమును మించిన మంజుల సుస్వరూపమో!
మండితమౌ విమానమని మారుతి యెంచెను విస్మితాత్ముఁడై. 8- 3
*వసంతకాలము
No comments:
Post a Comment