సిద్ధిధాత్రి
కం. ఇద్ధర తన సాధకులకు
సిద్ధుల నిడు సిద్ధిధాత్రి చెరుగని కరుణన్
సిద్ధసురాసురవందిత
వృద్ధిక్షయముల కతీత వేడుడు భక్తిన్.
తేగీ. శివునకే సిద్ధుల నిడెను సిద్ధిధాత్రి
అర్థ భాగ మాయెను తల్లి యతని మేన
నర్థ నారీశ్వరుండను ఖ్యాతి దెచ్చె
మాత కృపయున్న వశము బ్రహ్మాండ మెల్ల.
ఆవె. సిద్ధిధాత్రి కృపకు చేరువ యైనచో
వాంఛ లుడిగి దేవి పాదపద్మ
యుగళి సంచరించు మొగరంభమై వెల్గి
పరమపదము నొందు నరుఁడు దుదకు.

No comments:
Post a Comment