స్కందమాత
కం. అందమగు నారు మొగముల
స్కందుం డాడగను దల్లి చల్లని యొడిలో
విందొనరించును భక్తుల
కందరకును 'స్కందమాత' యానందముగా.
తేగీ. సింహవాహి చతుర్భుజ శృంగ వాసి
వామ హస్తాల పద్మము వరద ముద్ర
స్కందు చేఁబట్టు దక్షిణ కరముతోడ
భక్త జన సంకటమ్ములఁ బాపు తల్లి.
కం. ఐదవ దినమున మదిలో
మోదముతో 'స్కందమాత' మూర్తిని గొలువన్
బాధల బాపును గరమిడి
చేదుకొనున్ దేవి మనను చెంతకు దయతో.

No comments:
Post a Comment