ఆవె. సృష్టి లేని ముందు చిమ్మచీకటి నిండఁ
జిన్న నవ్వు నవ్వి చేసి మాయ
లిప్తలో సృజించె లీలగా కూష్మాండ
ఆది శక్తియై యజాండములను.
జిన్న నవ్వు నవ్వి చేసి మాయ
లిప్తలో సృజించె లీలగా కూష్మాండ
ఆది శక్తియై యజాండములను.
తేగీ. సూర్య మండలాంతర్వర్తి శుభపదాబ్జ
భాను కిరణప్రభాభాసమాన తేజ
మాత అష్టభుజాదేవి మహితశక్తి
భక్తమందార కూష్మాండ భయవిదూర.
భాను కిరణప్రభాభాసమాన తేజ
మాత అష్టభుజాదేవి మహితశక్తి
భక్తమందార కూష్మాండ భయవిదూర.
కం. నవరాత్రి పండుగల నా
ల్గవ దినమునఁ బూజ చేసి కడు శ్రద్ధను మా
నవుఁ డిడ కూష్మాండ బలిని
భవ ముడుగును దుదకుఁ బరమపదము లభించున్.
ల్గవ దినమునఁ బూజ చేసి కడు శ్రద్ధను మా
నవుఁ డిడ కూష్మాండ బలిని
భవ ముడుగును దుదకుఁ బరమపదము లభించున్.

No comments:
Post a Comment