కం. హిమవత్పర్వత పుత్రిక
యుమ నారదు హితవు నెంచి యుడుగని దీక్షన్
ప్రమథపతి నుంచి మది నను
పమ తపమును నాచరించెఁ బలువత్సరముల్.
యుమ నారదు హితవు నెంచి యుడుగని దీక్షన్
ప్రమథపతి నుంచి మది నను
పమ తపమును నాచరించెఁ బలువత్సరముల్.
తేగీ. బ్రహ్మచారిణియై తపో వనమునందు
బ్రహ్మమును గూర్చి తపియించెఁ బర్వత సుత
బ్రహ్మ మనఁ దపంబని పల్కెఁ బ్రాతచదువు
బ్రహ్మమునఁ దాను బొందెను భవునిఁ. బతిగ.
బ్రహ్మమును గూర్చి తపియించెఁ బర్వత సుత
బ్రహ్మ మనఁ దపంబని పల్కెఁ బ్రాతచదువు
బ్రహ్మమునఁ దాను బొందెను భవునిఁ. బతిగ.
తేగీ. బ్రహ్మమే తానుగా నొప్పు భవునిరాణి
బ్రహ్మ మొనరించె లీలగా బ్రహ్మచారి
ణిగను భక్తుల నేలగ నిరుపమ కృప
కొలువ నవరాత్రులందునఁ గలుగు శుభము.
బ్రహ్మ మొనరించె లీలగా బ్రహ్మచారి
ణిగను భక్తుల నేలగ నిరుపమ కృప
కొలువ నవరాత్రులందునఁ గలుగు శుభము.

No comments:
Post a Comment