తేగీ. అర్థ చంద్రుఁడు శిరమందు నాడుచుండఁ
బ్రమదమున ఘంట రూపాన స్వర్ణ కాంతు
లీను మేనితో సౌమ్యయై యిలను నేలు
చంద్రఘంటను భజియింపఁ జాల శుభము.
కం. పది చేతులతో నొప్పుచుఁ
బదునౌ ఖడ్గమ్ము వంటి పలు శస్త్రములన్
గదనోత్సాహిగ గదలుచు
ముదమౌ భక్తులకు భయదమును దుష్టులకున్.
తేగీ. యుద్ధ సన్నద్దు రాలయి యున్న కతన
శీఘ్రముగ భక్తకోటికిఁ జింత లణచ
సర్వదా చూచు చుండును చంద్రఘంట
కొలువ నవరాత్రముల నీమె కొంగు పైడి.

No comments:
Post a Comment