padyam-hrudyam

kavitvam

Wednesday, October 26, 2011

దీపావళి


దివ్వెల కాంతులు, వెల్గుల భ్రాంతులు, తేజము నిండగ నెల్లెడలన్
రివ్వున జువ్వలు, రవ్వల రువ్వులు, రిక్కలు పొంగగ నింగి పయిన్
దవ్వుల, దాపుల, సవ్వడి, సందడి దద్దరిలంగను నల్దిశలున్
నవ్వులపువ్వులు, తియ్యనిబువ్వలు నల్వురుమెచ్చగ రమ్యముగన్!

2 comments:

రాకుమార said...

మీ హృద్యమైన పద్యం కర్ణామృతంగానూ ఉంది.
మీకూ...., మీ ఇంటిల్లిపాదికీ.. "దీపావళి" శుభాకాంక్షలు. ఏదో.. సరదా.. ఊహాతేటగీతి...మీ బ్లాగు మాధ్యమంగా పంచుకుందామని తట్టింది. స్వాగతిస్తారుగా........?
సిరికి లోకాన పూజలు జరుగు వేళ
చూడ వచ్చెను నింగిన చుక్కలన్ని
ఏడ జాబిలి ఎటుపాయె లేడదేమి?
భువికి దిగెనేమొ అక్కకై "దివిలె" వోలె!

మిస్సన్న said...

అద్భుతమ్మైన భావమ్ము నమరజేసి
తెలుగు పద్యంపు ప్రీతిని ' తేట ' పఱచి
సహృదయతను వెలార్చిన సజ్జన మణి!
మీకు స్వాగ తమనియెద ! రాకుమార!