పద్యము తెలుగుల విద్యగు! హృద్యము చదువరుల కెన్న, నింపగు వినగా ! పద్యము కవితల కాద్యము! సద్యశమును కల్గజేయు చక్కగ కవికిన్!
మీ హృద్యమైన పద్యం కర్ణామృతంగానూ ఉంది.మీకూ...., మీ ఇంటిల్లిపాదికీ.. "దీపావళి" శుభాకాంక్షలు. ఏదో.. సరదా.. ఊహాతేటగీతి...మీ బ్లాగు మాధ్యమంగా పంచుకుందామని తట్టింది. స్వాగతిస్తారుగా........? సిరికి లోకాన పూజలు జరుగు వేళ చూడ వచ్చెను నింగిన చుక్కలన్ని ఏడ జాబిలి ఎటుపాయె లేడదేమి? భువికి దిగెనేమొ అక్కకై "దివిలె" వోలె!
అద్భుతమ్మైన భావమ్ము నమరజేసితెలుగు పద్యంపు ప్రీతిని ' తేట ' పఱచి సహృదయతను వెలార్చిన సజ్జన మణి!మీకు స్వాగ తమనియెద ! రాకుమార!
Post a Comment
2 comments:
మీ హృద్యమైన పద్యం కర్ణామృతంగానూ ఉంది.
మీకూ...., మీ ఇంటిల్లిపాదికీ.. "దీపావళి" శుభాకాంక్షలు. ఏదో.. సరదా.. ఊహాతేటగీతి...మీ బ్లాగు మాధ్యమంగా పంచుకుందామని తట్టింది. స్వాగతిస్తారుగా........?
సిరికి లోకాన పూజలు జరుగు వేళ
చూడ వచ్చెను నింగిన చుక్కలన్ని
ఏడ జాబిలి ఎటుపాయె లేడదేమి?
భువికి దిగెనేమొ అక్కకై "దివిలె" వోలె!
అద్భుతమ్మైన భావమ్ము నమరజేసి
తెలుగు పద్యంపు ప్రీతిని ' తేట ' పఱచి
సహృదయతను వెలార్చిన సజ్జన మణి!
మీకు స్వాగ తమనియెద ! రాకుమార!
Post a Comment