సీ. చెక్కిళ్ళ పై నుండి చిక్కగా కారిన
.....మదజల మాను షట్పదము లవియె
అటునిటు కదలుచు నహిరాజు రీతిని
.....తోచెడు నందమౌ తుండ మదియె
చంద్ర ఖండమ్మన చక్కని వంపుతో
.....ధవళ కాంతులనీను దంత మదియె
మ్రొక్కులు చెల్లించి మోదమ్ముతో భక్తు-
.....లిడ చేత దాల్చిన కుడుము లవియె
తే.గీ. జగతి కాధార భూత మీ నగజ సుతుఁడు
శివుని గారాలపట్టి యీ క్షేమకరుఁడు
దేవి నంకాన దాల్చు నీ దివిజనుతుఁడు
వల్లభేశుని కర్పింతు వందనములు.
వల్లభేశుని కర్పింతు వందనములు.