padyam-hrudyam

kavitvam

Tuesday, August 26, 2025

వల్లభేశునికి వందనములు



సీ. చెక్కిళ్ళ పై నుండి చిక్కగా కారిన
.....మదజల మాను షట్పదము లవియె
అటునిటు కదలుచు నహిరాజు రీతిని
.....తోచెడు నందమౌ తుండ మదియె
చంద్ర ఖండమ్మన చక్కని వంపుతో
.....ధవళ కాంతులనీను దంత మదియె
మ్రొక్కులు చెల్లించి మోదమ్ముతో భక్తు-
.....లిడ చేత దాల్చిన కుడుము లవియె

తే.గీ. జగతి కాధార భూత మీ నగజ సుతుఁడు
శివుని గారాలపట్టి యీ క్షేమకరుఁడు
దేవి నంకాన దాల్చు నీ దివిజనుతుఁడు
వల్లభేశుని  కర్పింతు వందనములు.



No comments: