పద్యము తెలుగుల స్వంతము హృద్యము చదువరుల కెన్న, నింపగు వినగా పద్యము కవితల కాద్యము సద్యశమును కల్గజేయు చక్కగ కవికిన్.
ఉ. ఆరని జ్ఞానధార! సకలాగమసార! శుభప్రసార! కా
శ్మీరవిహార! సుందరశుచిస్మితతార! ప్రబంధశాస్త్రసం
చార! బుధాంతరంగసువిచార! యవిద్యవిదూర! వాక్సుధా
పూర! సరస్వతీ! ప్రణతి బ్రోవవె చిన్మయరూపిణీ! శివా!
Post a Comment
No comments:
Post a Comment